కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌ ప్రీ రిలీజ్‌

18-10-2019

కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌ ప్రీ రిలీజ్‌

బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌. శ్రీనాధ్‌ పులకరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 18న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జెఆర్‌సిలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యంగ్‌ అండ్‌ టాలెంటెండ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఆడియో బిగ్‌ సిడి ని, నటుడు బ్రహ్మానందం ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం మాట్లాడుతూ హాస్య కుటుంబ నుంచి వచ్చిన పిల్లలు హాస్యానికే పరిమితం అనుకుంటారు కానీ అది నిజం కాదు అని నిరూపించడానికి హీరోగా కృష్ణ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నటుడు కృష్ణ భగవాన్‌, ఆలీ, రాజీవ్‌ కనకాల, తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, చిట్టిబాబు, రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.