మెగాస్టార్‌ సరనన ఎవరు ?

18-10-2019

మెగాస్టార్‌ సరనన ఎవరు ?

చిరంజీవి-కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. నవంబరు నుంచీ చిత్రీకరణ మొదలవుతుంది. ఈలోగా కథానాయికల వేటను ముమ్మరం చేశారు. ఈ చిత్రంలో చిరుతో కలిసి నటించేది ఎవరన్న విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నాయికల జాబితాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అనుష్క, కాజల్‌, నయనతార పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు త్రిష పేరు కూడా చేరింది. చిరు-త్రిష ఇది వరకు స్టాలిన్‌ లో నటించారు. త్రిష కూడా తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఓ మంచి సినిమాతో టాలీవుడ్‌లో తిరిగి అడుగు పెట్టాలని భావిస్తోంది. అన్నీ కుదిరితే స్టాలిన్‌ జోడీని మరోసారి చూడొచ్చు.