హిమాలయాలకు సూపర్‌స్టార్‌

15-10-2019

హిమాలయాలకు సూపర్‌స్టార్‌

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మళ్లీ హిమాలయాలకు వెళ్లారు. ఆయన నటిస్తున్న దర్బార్‌ చిత్రం షూటింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఆదివారం ఉదయం విమానంలో డెహ్రాడూన్‌కు బయల్దేరి వెళ్లారు. రజనీకాంత్‌ తాను నటించే సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక తనకెంతో ఇష్టమైన హిమాలయాలకు వెళ్లటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అదే క్రమంలో దర్బార్‌ షూటింగ్‌ ముగియడంతో కొద్ది రోజులుగా చెన్నైలో విశ్రాంతి తీసుకున్న రజనీ హిమాలయాలకు బయలుదేరి వెళ్ళారు. కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌ క్షేత్రాలను సందర్శించిన తర్వాత ఆయన హిమాలయాల్లో ఉన్న బాబాజీ గుహలో ధ్యానం చేయనున్నట్లు తెలుస్తోంది.