మరో రీమేక్‌లో నయన ?

15-10-2019

మరో రీమేక్‌లో నయన ?

నయనతార తెలుగు సినిమాల్ని తగ్గించుకుని చాలా కాలమైంది. సుదీర్ఘ విరామం తరవాత సైరా లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ మరో తెలుగు సినిమాలో నటించడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఈ మధ్య రానా ఓ కొరియన్‌ చిత్రాన్ని చూశారట. ఆ సినిమా నయనతారతో రీమేక్‌ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని నయనతారకు చూపించారని, తను ఈ రీమేక్‌లో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కించే అవకాశాలున్నాయి. రానా నిర్మాతగా వ్యవహరిస్తారు.