తోలు బొమ్మలాట మోషన్‌ పోస్టర్‌ విడుదల

14-10-2019

తోలు బొమ్మలాట మోషన్‌ పోస్టర్‌ విడుదల

రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తోలుబొమ్మలాట. విశ్వంత్‌, హర్షిత చౌదరి, వెన్నెల కిషోర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకుడు. దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మాత. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ నా కెరీర్‌లో ఐదు అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా ఉంటుంది. స్నేహంలోని మాధుర్యాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు అన్నారు. అనుబంధాల గొప్పతనం చాటేలా

ఉంటుందన్నారు దర్శకుడు. విశ్వనాథ్‌, నేను కేరింత తో కెరీర్‌ను మొదలు పెట్టాం. మా ఇద్దరి వయసులకు మించిన చిత్రమిద న్నారు విశ్వంత్‌. కార్యక్రమంలో దేవి ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌, నారాయణరావు, కల్పన, హర్షిత చౌదరి తదితరులు పాల్గొన్నారు.