నాకిదే ఫస్ట్‌ టైమ్‌ తొలి షెడ్యూల్‌ పూర్తి

12-10-2019

నాకిదే ఫస్ట్‌ టైమ్‌ తొలి షెడ్యూల్‌ పూర్తి

చింటు కంచర్ల, కావ్య కీర్తి, ఆదిత్య రెడ్డి.కె, ధనుష్‌బాబు, సోషియా ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్న చిత్రం నాకిదే ఫస్ట్‌టైమ్‌. ముస్కురాం రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కురుపాల విజయకుమార్‌ నిర్మాత. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ అనుభూతిని పంచే ఒక మంచి ప్రేమకథా చిత్రమిది. ఒక జంటకి ప్రేమలో ఎదురైన తొలి అనుభవాలు ఎలాంటిన్నది తెరపైనే చూడాలి. కథలో పలు మలుపులుంటాయి. గాయని శ్రావణ భార్గవి పాడిన పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే గోవా, అరకులో పాటల్ని చిత్రీకరించబోతున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ కురాకుల, ఛాయాగ్రహణం: గోపి.