స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ట్రైలర్‌ని విడుదల చేసిన సుకుమార్‌

11-10-2019

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ట్రైలర్‌ని విడుదల చేసిన సుకుమార్‌

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోస్టర్‌, ట్రైలర్‌ బాగున్నాయి. 1 నేనొక్కడినే, 100%లవ్‌ చిత్రాలకు కథ అందించిన హరిప్రసాద్‌ ఈ సినిమాకు స్టోరీ అందించారంటే కథ ఎలా ఉంటుందో తెలుస్తోంది అన్నారు డైరెక్టర్‌ సుకుమార్‌. సంజయ్‌ ఇదామ, శ్రీనాధ్‌ మాగంటి, అహల్య సురేష్‌, ప్రియ ముఖ్య తారలుగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌. రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మించి ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్‌ విడుదల చేశారు. బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మంచి సందేశం ఉన్న కథతో తీశాం. డబ్బు వస్తుందా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే సినిమా తీశాననే సంతృప్తి ఉంది అన్నారు. ఆత్మహత్మ సమస్యకు పరిష్కారం కాదని మా సినిమాలో చెప్పా అన్నారు కరుణ కుమార్‌. సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.కిషోర్‌, కెమెరా: సునీల్‌ కుమార్‌.ఎన్‌.