Palasa 1978 Official Teaser launched by Director Puri Jagannath

రక్షిత్‌, నక్షత్ర జంటగా సుధా మీడియా పతాకంపై తెరకెక్కిన చిత్రం పలాస 1978. కరుణ కుమార్‌ దర్శకుడు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్‌ కథలంటే నాకు చాలా ఇష్టం. గ్యాంగ్‌స్టర్‌ కథగా రూపొందిన పలాస టీజర్‌ నాకు నచ్చింది. హీరోహీరోయిన్‌ నటనతో పాటు దర్శకుడు కరుణకుమార్‌ పని తీరు నాకు బాగా నచ్చింది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 1978 ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిదన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుల్‌ విన్సెంట్‌, పాటలు: భాస్కరభట్ల, సుద్దాల అశోక్‌తేజ, లక్ష్మీ భూపాల.