సైరా సంబరాలు

05-10-2019

సైరా సంబరాలు

సైరా సూపర్‌ హిట్‌తో మెగా సంబరాలు మొదలైపోయాయి. గురువారం థాంక్స్‌ మీట్‌ పెట్టిన చిత్ర బృందం.. అదే రోజు రాత్రి మెగా పార్టీ చేసుకుంది. సైరా విజయాన్ని పురస్కరించుకొని అల్లు అరవింద్‌ ఇంట్లో సక్సెస్‌ పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీలో మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, రామ్‌చరణ్‌, సురేందర్‌ రెడ్డి, అల్లు అర్జున్‌, అల్లు శిరిష్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, అఖిల్‌, శ్రీకాంత్‌, నవదీప్‌తో పాటు కొందమంది దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఇక మెగా ఫ్యామిలీలో ఓ సినిమా విజయవంతమైతే ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయడం అల్లు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది.శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ పార్టీ జరిగిందని సమాచారం.