శీను వేణు ఆడియో విడుదల

05-10-2019

శీను వేణు ఆడియో విడుదల

అభిషేక్‌, ప్రజ్వల్‌ కుమార్‌, మధుప్రియ, పూజిత నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం శీను వేణు. వీళ్లు మంచి కిడ్నాపర్స్‌... అనేది ఉపశీర్షిక. రవి ములకపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. గడ్డం కృష్ణ సమర్పిస్తున్నారు. రవి స్వరకల్పనలోని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ఫిలిం చాంబర్‌లో జరిగింది. నిర్మాతలు సి.కల్యాణ్‌, రామసత్యనారాయ, విద్యావేత్త రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. ఊళోల గొర్రెలు కాసే ఇద్దరమ్మయిలు అపహరణకి గురయ్యాక, వాళ్లని ఇద్దరబ్బాయిలు ఎలా రక్షించారన్నది ఆసక్తికరం. హాస్యం, భావోద్వేగాలకి ప్రాధాన్యమున్న చిత్రమిది అన్నారు. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయని అతిథులు మెచ్చుకున్నారు.