లైఫ్‌ స్టైల్‌ ఫస్ట్‌లుక్‌

05-10-2019

లైఫ్‌ స్టైల్‌ ఫస్ట్‌లుక్‌

నెహ్రు విజయ్‌, రోజా, నిఖిల్‌, సంతోషి కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం లైఫ్‌ స్టైల్‌. సి.ఎల్‌.సతీశ్‌ మార్క్‌ దర్శకత్వంలో కలకొండ నర్సింహ నిర్మించారు. ఫిల్మ్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను వకుళాభరణం కృష్ణ మోహనరావు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సోషల్‌ మీడియా, పెరుగుతున్న టెక్నాలజీ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? యువత లైఫ్‌ స్టైల్‌ ఎలా మారుతుంది అన్న కథతో రూపొందిన చిత్రమిది అని చెప్పారు. త్వరలో సినిమాను విడుదల చేస్తాం అని నిర్మాత చెప్పారు.