మ్యాడ్‌ హౌస్‌ లో వినోదం

23-09-2019

మ్యాడ్‌ హౌస్‌ లో వినోదం

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మ్యాడ్‌ హౌస్‌ వెబ్‌ సిరీస్‌ కర్టెన్‌రైజర్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మ్యాపర్‌ సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సిరీస్‌కు మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రోమో విడుదల చేసిన అనంరతం నీహారిక మాట్లాడుతూ ప్రతిరోజు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని యువత ఎలా అధిగమిస్తున్నారనే కాన్సెప్ట్‌తో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ఇది.ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యు ట్యూబ్‌ వేదికగా 100 ఎపిసోడ్స్‌ ప్లాన్‌ చేసాం. ప్రతివారం ఒక ఎపిసోడ్‌ విడుదల చేస్తాం. గతంలో నేను చేసిన ముద్దపప్పు అవకాయ్‌, నాన్నకూచి తరహాలోనే ఈ సిరిస్‌ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుదని నమ్ముతున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మహేశ్‌ ఉప్పల్‌, సహనిర్మాత (ఇన్ఫినిటమ్‌ సంస్థ) వందన, మ్యాపర్‌ యాప్‌ సీఈవో శుభకర్‌ పాల్గొన్నారు.