అందుకే వాటికి దూరంగా ఉంటా

23-09-2019

అందుకే వాటికి దూరంగా ఉంటా

ప్రత్యేక గీతాలు చేస్తాను తప్ప ఐటమ్‌సాంగ్స్‌ మాత్రం చేయను. ప్రత్యేక గీతాల్లో డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్న ఐటమ్‌సాంగ్‌ల ఉద్దేశమే మారిపోయింది అని అంటోంది రాధికా ఆప్టే. ఇటీవల కాలంలో నూతన నటీనటుల దగ్గరినుంచి స్టార్‌ హీరోయిన్ల వరకు ఐటమ్‌సాంగ్స్‌లో నటించేందుకు అమితాసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. స్పెషల్‌ సాంగ్స్‌, ఐటమ్‌సాంగ్స్‌లో దేనికి ప్రాధాన్యమిస్తారని అడిగిన ప్రశ్నకు రాధికాఆప్టే సమాధానమిస్తూ ఐటమ్‌సాంగ్స్‌లో మెరిసి మెప్పించి తారలందరికీ నేను భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. మన మేంటో నిరూపించుకోవడానికి ప్రత్యేక గీతాలు బాగా ఉపయోగపడతాయి. కానీ ఐటమ్‌సాంగ్స్‌లో అలాంటిదేమీ ఉండదు. పైగా ఇటువంటి గీతాల్లో నటించే తారలను పొట్టి దుస్తుల్లో మాత్రమే చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది.