గోపీచంద్‌ సరసన మిల్కీ బ్యూటీ

23-09-2019

గోపీచంద్‌ సరసన మిల్కీ బ్యూటీ

డైరెక్టర్‌ సంపత్‌ నంది సినిమాలు ఈ మధ్య బాక్స్‌ ఫీన్‌ దగ్గర ప్రభావం చూపించలేకపోతున్నాయి. అయితే సంపత్‌ మాత్రం ఆ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా తన కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. యాక్షన్‌ హీరోలకు కేరాఫ్‌ అడ్రెన్‌ అయిన గోపీచంద్‌తో సంపత్‌ తన నెక్ట్స్‌ సినిమా చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జోరుగా సాగుతోందని సమాచారం. ఈ సినిమాలో గోపీ సరసన హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. సంపత్‌ నందీ దర్శకత్వంలో తెరకెక్కిన రచ్చ, బెంగాల్‌ టైగర్‌ సినిమాల్లో తమన్నా హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్‌ కొత్త సినిమా సంపత్‌ నంది- తమన్నా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కానుంది. హీరోయిన్లను రిపీట్‌ చేయడం చాలా మంది దర్శకులకు అలవాటు. ఇప్పుడు సంపత్‌ కూడా అదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నాడు.