వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

21-09-2019

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలోని విజయ్‌ దేవరకొండ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. క్రియేటివ్‌ కమర్షియల్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు సమర్పిస్తున్న చిత్రమిది. క్రాంతి మాధవ్‌ దర్శకుడు. కె.ఎ.వల్లభ నిర్మాత. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, క్యాథరిన్‌ ట్రెసా, ఇజాబెల్లా లెయితే నాయికలు. నిర్మాత మాట్లాడుతూ విజయ్‌ దేవరకొండ ముఖంపై ఉన్న మరకలు క్యారక్టర్‌ ఇన్‌టెన్‌సిటీని తెలియజేస్తాయి. మా దర్శకుడు సెన్సిబుల్‌ కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. టైటిల్‌ జస్టిఫికేషన్‌ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం అని అన్నారు.