నచ్చకపోతే నన్ను తిట్టండి

21-09-2019

నచ్చకపోతే నన్ను తిట్టండి

ప్రేక్షకులకు నా సినిమా నచ్చితే పది మందికి తెలియజేయండి.. నచ్చకపోతే నన్ను తిట్టండి. ఎక్కడైనా తప్పు వుంటే ఎత్తిచూపండి. సరిదిద్దుకుంటాను అంటున్నారు దర్శకుడు దిలీప్‌ రాజా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం పండుగాడి ఫోటో స్టూడియో. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. హాస్యనటుడు అలీ హీరోగా రిషిత నాయికగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఎవరి సినిమా వారికి నచ్చుతుంది. కానీ నచ్చాల్సింది ప్రేక్షకులకు. వారికి నచ్చితేనే సినిమా విజయం సాధిస్తుంది. విభిన్నమైన కథతో పండుగాడి ఫోటో స్టూడియో చిత్రాన్ని తెరకెక్కించాను. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రంలో ఆలీ పంచే వినోదం అందరి కడుపుబ్బా నవ్విస్తుంది అని తెలిపారు.