సితార బ్యానర్‌లో నాగశౌర్య

20-09-2019

సితార బ్యానర్‌లో నాగశౌర్య

నాగశౌర్య కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. మా సంస్థ నిర్మించబోతున్న ఎనిమిదవ చిత్రమిది. అక్టోబర్‌ లో చిత్రీకరణ మొదలుపెడతాం. వచ్చే ఏడాది మే నెలలో ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అని చిత్రబృందం ప్రకటించింది.