ఘనంగా ఐఫా ఉత్సవం

20-09-2019

ఘనంగా ఐఫా ఉత్సవం

బాలీవుడ్‌ తారల తళుకుబెళుకుల మధ్య ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ (ఐఫా) 2019 అవార్డుల వేడుక ఆద్యంతం హుషారుగా కొనసాగింది. ముంబయిలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ స్టార్లు రణవీర్‌ సింగ్‌, కత్రినా కైఫ్‌, మాధురీ దీక్షిత, సారా అలీఖాన్‌లు తమ డ్యాన్స్‌ షోలతో అలరించారు. ఒక ఈ ఏడాది ఉత్తమ నటుడిగా రణవీర్‌ సింగ్‌ (పద్మావత్‌), ఉత్తమ నటిగా అలియా భట్‌ (రాజీ) ఐఫా అవార్డులను అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా రాజీ, ఉత్తమ దర్శకుడిగా శ్రీరామ్‌ రాఘవన్‌ (అంధాదున్‌), ఉత్తమ సహాయ నటుడిగా విక్కీ కౌశల్‌ (సంజు), ఉత్తమ సహాయ నటిగా అదితి రావు హైదరి (పద్మావత్‌) అవార్డులను దక్కించుకున్నారు. అదేవిధంగా గడిచిన 20 సంవత్సరాల్లో ఉత్తమ నటుడిగా రణబీర్‌ కపూర్‌, ఉత్తమ నటిగా దీపికా పదుకునే, ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్‌ హిరాణి ఐఫా అవార్డులను అందుకున్నారు. ఈ వేడుకల్లో సల్మాన్‌ ఖాన్‌, రేఖ, సరోజ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొని సందడి చేశారు.