వంశీ పైడిపల్లికి మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌

20-09-2019

వంశీ పైడిపల్లికి మహేశ్‌  గ్రీన్‌ సిగ్నల్‌

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించిన మహేష్‌బాబు.. ఆయనతో మరో సినిమా చేయనున్నారనే విషయం తెలిసిందే. అయితే అది సరిలేరు నీకెవ్వరు తరువాత ఉంటుందా లేక ఆ తరువాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రానుందని సమాచారం. మహేష్‌ కోసం పైడిపల్లి సిద్ధం చేసిన కథను మహేష్‌ ఒకే చేశారని, సరి లేరు అనంతరం ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా మెల్లగా పుంజుకుని మహేష్‌బాబు కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన మహర్షి చిత్రాన్ని మించిన కథను పైడిపల్లి రెడీ చేశారని, మహేష్‌బాబు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్‌ వర్గాల భోగట్టా.