మన్‌ బైరాగి ఫస్ట్‌లుక్‌ విడుదల

18-09-2019

మన్‌ బైరాగి ఫస్ట్‌లుక్‌ విడుదల

ప్రధాని నరేంద్రమోదీ వైఫల్యాన్ని ఒప్పుకోరు. విజయం వరించేవరకు వదిలిపెట్టరు. అందుకు తాజా ఉదాహరణ ఆయన బయోపిక్‌ను మళ్లీ నిర్మిస్తుండడం. ఇంతకుముందు వివేక్‌ ఒబారాయ్‌ నరేంద్రమోదీ బయోపిక్‌లో నటించారు. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు మోదీ జీవతంపై మరో చిత్రం తీస్తున్నారు. సంజయ్‌లీలా భన్సాలి-మహావీర్‌ జైన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను పాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ సంయుక్తంగా విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సాహో స్టార్‌ ప్రభాస్‌ అన్నారు. హిందీలో మన్‌ బైరాగి అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో మనో వైరాగి అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం హిందీతో పాటు తమిళ, తెలుగు, గుజరాతీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.