శ్రీకాంత్‌ ఆవిష్కరించిన డస్టర్‌ 1212 ఫస్ట్‌లుక్‌

18-09-2019

శ్రీకాంత్‌ ఆవిష్కరించిన డస్టర్‌ 1212 ఫస్ట్‌లుక్‌

అథర్వా కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం డస్టర్‌ 1212 తెలుగులో విడుదలకానుంది. బద్రీ వెంకటేష్‌ దర్శకుడు. శుభకారి క్రియేషన్స్‌ పతాకంపై మరిపి విద్యాసాగర్‌ (వినయ్‌) తెలుగులో అందిస్తున్నారు. అనైకాసోటి మిస్తీ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శ్రీకాంత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళంలో ఈ సినిమా పెద్ద విజయం సాధించిందని తెలిసింది. తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. బ్యాచిలర్‌ అయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కథ ఇది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుంది. వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందించారు. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. దేవదర్శిని, జి.కె.రెడ్డి, ఎం.ఎస్‌.భాస్కర్‌, మనోబాల, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అమర్నాథ్‌, సంభాషణలు: రాజశేఖర్‌రెడ్డి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, దర్శకత్వం: బద్రీ వెంకటేష్‌.