గోపీచంద్‌ ఇంట్లో సందడి!

18-09-2019

గోపీచంద్‌ ఇంట్లో సందడి!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, మాచో హీరో గోపీచంద్‌ ప్రాణస్నేహితులనే సంగతి తెలిసిందే. వర్షం సినిమా నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. గోపీచంద్‌ రెండో కుమారుడు వియాన్‌ మొదటి జన్మదినోత్సవం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై వియాన్‌కు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించారు. సాహో విడుదల తర్వాత బయట పెద్దగా కనిపించని ప్రభాస్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వియాన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. అలాగే శ్రీకాంత్‌, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, సంపత్‌ నంది, తేజ, మంచు విష్ణు తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.