శకుంతలా దేవి ఫస్ట్‌లుక్‌ విడుదల

17-09-2019

శకుంతలా దేవి ఫస్ట్‌లుక్‌ విడుదల

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన గణిత మేధావి, భారతీయురాలు శకుంతలా దేవి జీవితం ఆధారంగా, ఆమె పేరుతో హిందీలో ఓ బయోపిక్‌ రూపొందుతోంది. విద్యా బాలన్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. క్యాలిక్యుటేటర్‌, కంప్యూటర్‌ కంటే శకుంతలా దేవి స్పీడుగా లెక్కలు చేస్తారని పేరుంది. అందుకని, హ్యూమన్‌ కంప్యూటర్‌ అని పేరొచ్చింది. దాన్నే ఉపశీర్షికగా ఖరారు చేశారు. అందుకు తగ్గట్టుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. శకుంతలా దేవి గణిత మేథావి మాత్రమే కాదు, ఆమెలో మంచి హాస్య చతురత దాగుంది. సినిమాలో మంచి వినోదం ఉంటుంది. రోజు రోజూకు ఈ సినిమాపై నా ఆసక్తి రెట్టింపు అవుతోంది అని విద్యా బాలన్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి అనూ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.