రాజశేఖర్‌ సరసన నందిత శ్వేత ?

17-09-2019

రాజశేఖర్‌ సరసన నందిత శ్వేత ?

రాజశేఖర్‌ హీరోగా దర్శకుడు ప్రదీప్‌ కృష్ణమూర్తి కొత్త ప్రాజెక్టును తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అధినేత జి ధనుంజయన్‌ నిర్మాత. త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్రీ ప్రొడక్షన్స్‌ వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే రాజశేఖర్‌ సరసన నందితా శ్వేతను హీరోయిన్‌గా చిత్రబృందం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. కల్కిలో కీలక పాత్ర పోషించి సినిమాకు ప్లస్సయిన నందిత మరోసారి రాజశేఖర్‌తో జోడీ కట్టబోతోంది. సత్యరాజ్‌, నాజర్‌, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారన్నది తాజా సమాచారం.