డ్రీమ్‌ గర్ల్‌ రీమేక్‌ లో నాగచైతన్య ?

17-09-2019

డ్రీమ్‌ గర్ల్‌ రీమేక్‌  లో నాగచైతన్య ?

ఆయుష్మాన్‌ ఖురానా నటించిన అందాధున్‌ రీమేక్‌లో నితిన్‌ నటించడం ఖరారైపోయింది. బదాయి హో రీమేక్‌లో నటించే హీరో కూడా ఫిక్స్‌ అయిపోయినట్లేనని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆయుష్మాన్‌ ఖురానా రీసెంట్‌ హిట్‌ డ్రీమ్‌ గర్ల్‌ను కూడా తెలుగులో రీమేక్‌ చేసే ప్రోసెస్‌ స్టార్ట్‌ అయిపోయిందని, ఇందులో నాగచైతన్య నటించే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 50 కోట్లు వసూలు చేసిన డ్రీమ్‌ గర్ల్‌ సునాయాసంగా వంద కోట్లు వసూలు చేయడం ఖాయమని అక్కడి ట్రేడ్‌ పండిట్స్‌ ఫిక్స్‌ అయిపోయారు. హిందీ హీరోలతో పాటు, తెలుగు హీరోల్లోనూ రెస్పెక్ట్‌ సంపాదించుకున్న ఆయుష్మాన్‌ ఖురానా డ్రీమ్‌గర్ల్‌ చిత్రంలో పోషించిన టైటిల్‌ రోల్‌ అందరి ప్రశంసలు పొందుతోంది.