21న అక్కినేని జయంతి వేడుక

17-09-2019

21న అక్కినేని జయంతి వేడుక

అక్కినేని జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే ఏయన్నార్‌ స్వర్ణ కంకణ పురస్కార వేడుక ఈ నెల 21న హైదరాబాద్‌లో జరగనుంది. టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్‌ ఆధ్వర్యంలో రాగసప్త స్వర్ణం సంస్థ నిర్వహించే ఈ వేడుక రవీంద్రభారతిలో ఘనంగా జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి సందర్భంగా ఈ ఏడాది గాయని కె.ఎస్‌.చిత్రకు స్వర్ణ కంకణ పురస్కారాన్ని అందజేస్తున్నామని రాగసప్త స్వరం అధ్యక్షురాలు వి.ఎస్‌.రాజలక్ష్మీ, కార్యదర్శి కె.అహల్య, తిరుమల గ్రూప్‌ చైర్మన్‌ నంగునూరి చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, మానేపల్లి రామారావు హాజరవుతారని వి.ఎస్‌.రాజలక్ష్మి తెలిపారు.