మరో హారర్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌

17-09-2019

మరో  హారర్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌

హారర్‌, థ్రిల్లర్‌ కథల వైపు అగ్ర కథానాయకులు కూడా మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా రానా ఓ హారర్‌ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. సిద్దార్థ్‌తో తమిళంలో గృహం అనే చిత్రాన్ని తెరకెక్కించారు మిళింద్‌ రావు. ఆ చిత్రం తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన రానాకు ఓ కథ చెప్పారట. గృహం తరహాలోనే భయం, ఉత్కంఠ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించబోతున్నారు. నవంబరు నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి.