లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌ టీజర్‌ విడుదల

16-09-2019

లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌ టీజర్‌ విడుదల

మలయాళంలో షకీలా సినిమా విడుదలైందంటే థియేటర్లకు లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌ అని అడల్ట్‌ కంటెంట్‌ చేసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్పారు. ఇప్పుడు అదే పేరుతో షకీలా సమర్పణలో సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌ అనే చిత్రం రూపొందింది. రమేశ్‌ కావలి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. సాయిరామ్‌ దాసరి మాట్లాడుతూ ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తియింది. తమిళ రైట్స్‌ను షకీలా గారు తీసుకున్నారు అన్నారు. ఈ సినిమా రషెస్‌ చూశాను. మంచి వినోదం ఉంది అన్నారు షకీలా.