వాల్మీకి ప్రీ రిలీజ్‌ వేడుక

16-09-2019

వాల్మీకి ప్రీ రిలీజ్‌ వేడుక

వరుణ్‌ తేజ్‌, పూజాహెగ్డే, అధర్య ప్రధాన పాత్రధారులుగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ పస్ల్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన వాల్మీకి చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇందులో వరుణ్‌తేజ్‌ విభిన్నమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో విక్టరీ వెంకటేష్‌ విచ్చేశారు. ఇంకా దిల్‌ రాజు, వరుణ్‌తేజ్‌, పూజాహెగ్డే, హరీష్‌శంకర్‌, బ్రహ్మానందం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.