అక్షయ్‌పై కక్ష కట్టారా?

16-09-2019

అక్షయ్‌పై కక్ష కట్టారా?

వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్‌పై కొందరు కక్ష కట్టినట్లుగా ఉంది. అతను తనతో నటించే ఆడవాళ్లందరితోనూ మిస్‌ బిహేవ్‌ చేస్తాడని ఆరోపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇవి ట్రెండ్‌ అవుతున్నాయి. అక్షయ్‌ ఎవరెవరితో అనుచితంగా ప్రవర్తించాడో పేర్లతో సహా పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. ఇది కప్పి పుచ్చుకోవడానికే అతను సామాజిక, దేశభక్తి వంటి అంశాలపై సినిమాలు చేస్తుంటాడని కూడా వారు ఆరోపిస్తున్నారు.