ముచ్చటగా మూడో చిత్రం

16-09-2019

ముచ్చటగా మూడో చిత్రం

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్‌ వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌కి రంగం సిద్ధమైంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య హంగులతో పాటు ప్రస్తుత సమజంలోని ప్రధాన సమస్యను ఆధారంగా చేసుకొని బోయపాటి అద్భుతమైన కథ సిద్దం చేశారు. సింహా, లెజెండ్‌ చిత్రాల్లో బాలకృష్ణగారి పవర్‌పుల్‌ లుక్స్‌ అందరినీ మెప్పించాయి. అటువంటి మరో పవర్‌పుల్‌ లుక్‌లో హీరోని బోయపాటి చూపించనున్నారు. డిసెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది వేసవి చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అతి త్వరలో కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాం అని అన్నారు.