Actress Hema to Enter Politics Comments on CM Jagan

టాలీవుడ్‌ సినీ నటి హేమ సంచలన ప్రకటన చేశారు. త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన హేమ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమై మళ్లీ సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ పూర్తిగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని హేమ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను రాజమండ్రిలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నానని, పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.