శశి లలిత ఫస్ట్ లుక్ విడుదల

21-05-2019

శశి లలిత ఫస్ట్ లుక్ విడుదల

జయం మూవీస్‌ సమర్పించు శశి లలిత చిత్ర నిర్మాణానికి సర్వం సిద్ధమైనట్లు చిత్ర నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రం తెరకెక్కనుందన్నారు. ఈ సినిమా ద్వారా జయలితలకు జరిగిన అన్యాయం చూపించబోతున్నట్లు తెలిపారు. జయలలిత బాల్యం, సినీ జీవితం, ప్రేమ, రాజకీయాల్లో ఆమె సంబంధించిన యద్ధార్థాలతో పాట చనిపోవడానికి ముందు 78 రోజులు హాస్పిటల్‌లో జరిగినదేంటి అనే అంశాలుంటాయన్నారు. జయలలిత పాత్రలో కాజల్‌ దేవగన్‌, శశికళ పాత్రలో అమలాపాల్‌ నటించబోతున్నారని తెలిపారు. రెండున్నర గంటల్లో జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్నీ వివరించనున్నట్లు తెలిపారు. లక్ష్మీస్‌ వీరగ్రంథం చిత్రం ఎన్నికల కోడ్‌ వల్ల విడుదల చేయలేదన్నారు. వచ్చే ఏడాది శశి లలిత విడుదలవుతుందన్నారు. ఈ సమావేశంలో పున్నా పూర్ణచంద్రరావు, ఆదాడి మల్లికార్జునరావు, పలువురు పాల్గొన్నారు.