86 వసంతాల తెలుగు సినిమా

16-05-2019

86 వసంతాల తెలుగు సినిమా

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా.కె.ధర్మారావు కృషితో, ఫాస్‌ ముద్రించిన మరియు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన 86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం 1932 నుండి 2018 వరకు తెలుగు సినిమా ఎన్‌ సైక్లోపీడియా 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహుకరణ మహోత్సవం హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ మురళీమోహన్‌, మా అధ్యక్షులు నరేష్‌ వి కె, ప్రముఖ సినీ రచయిత డా.పరుచూరి గోపాల కృష్ణ, సినీ విజ్ఞానవిశారద ఎస్‌వి రామారావు, ప్రముఖ సినీ నటులు, రచయిత రావి కొండలరావు, డా.కేవి రమణచారి తదితరులు పాల్గొని ఫాస్‌ ప్రయత్నాన్ని అభినందించారు. ముఖ్య అతిధులను ఫాస్‌ అధ్యక్షుడు కె.ధర్మారావు శాలువాలతో సత్కరించారు.