మహర్షికి ఉపరాష్ట్రపతి ప్రశంస

16-05-2019

మహర్షికి ఉపరాష్ట్రపతి ప్రశంస

మహేశ్‌బాబు నటించిన మహర్షి చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం సినిమాపై ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో మంచి సందేశంతో మహర్షి రూపొందింది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి చిత్రం అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై మహేశ్‌బాబు స్పందిస్తూ దీన్ని మించిన ప్రశంస మరొకటి ఉండదనుకుంటున్నాను. ఆయన మాటలు మహర్షి లాంటి మరెన్నో మంచి సినిమాలు చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చాయి అని అన్నారు. మా సినిమాకు దక్కిన గొప్ప గౌరవమిది. వెంకయ్యనాయుడిగారి అభినందన మాకెప్పటికీ గుర్తుండిపోతుంది అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు.