తమన్నాతో మెగాస్టార్ స్టెప్పులు!

15-05-2019

తమన్నాతో మెగాస్టార్ స్టెప్పులు!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం సైరా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రం మేజర్‌ పోర్షన్‌ చిత్రీకరణను డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకా కొంత ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే బాకీ ఉంది. కొన్ని సన్నివేశాలు మైలారం విలేజ్‌, కోకాపేట పరిసరాలు, వికారాబాద్‌ అడవుల్లో చిత్రీకరించారు. తాజాగా హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి, తమన్నాతోపాటు నలభైమంది డాన్సర్లు పాల్గొన్నట్లు సమాచారం. పోరాట యోధుని కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆటవిడువుగా ఈ పాట చిత్రంలో ఉంటుంది. డాన్స్‌మాస్టర్‌ శేఖర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. అమిత్‌త్రివేది సంగీతం సారథ్యం వహిస్తున్నారు. కాగా రెండేళ్ళ క్రితం మా అవార్డు కార్యక్రమంలో చిరంజీవి స్టేజీపై చిందులేస్తే అప్పుడు తమన్నా కూడా జత కట్టింది. యాదృశ్చికమైనా ప్రస్తుతం సైరా కోసం ఇద్దరు కలిసి డాన్స్‌ వేయడం విశేషం.