కేన్స్ లో భారతీయ సినిమాలకు దక్కని చోటు

15-05-2019

కేన్స్ లో భారతీయ సినిమాలకు దక్కని చోటు

కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ ఏడాది ఓ ఒక్క భారతీయ సినిమా ఎంపిక కాలేదు. ప్రతీ ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా కేన్స్‌ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 72వ కేన్స్‌ చిత్రోత్సవం ఫ్రెంచ్‌లోని రివేరాలో ప్రారంభమైంది. పదకొండు రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తీసిన ఉత్తమ చిత్రాల్ని ప్రదర్శించనున్నారు. అయితే ఈ ఏడాది ఏ ఒక్క భారతీయ సినిమా ఎంపిక కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్‌ ఉత్సవాల జ్యూరీకి ప్రముఖ మెక్సిన్‌ దర్శకుడు ఆలెజాండ్రి అధ్యక్షతన వహించనున్నారు. భారత్‌ నుంచి పలువురు బాలీవుడ్‌ తారలు ఈ ఉత్సవంలో సందడి చేయనున్నారు. హినాఖాన్‌ నటించిన తొలి చిత్రం లైన్స్‌ మొదటి లుక్‌ను ఈ చిత్రోత్సవంలోనే ఆవిష్కరించనున్నారు.