హీరోగా వి.వి.వినాయక్ ?

15-05-2019

హీరోగా  వి.వి.వినాయక్ ?

దర్శకులు నటుల్వవడం, నటులు దర్శకులుగా అవతారం ఎత్తడం సర్వసాధారణమే. దర్శకులు నటులైనప్పుడు చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తుంటారు. పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్రలు చేయడం అరుదైన విషయం. అయితే ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఇప్పుడు కథా నాయకుడిగా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. వినాయక్‌ కథా నాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. దిల్‌రాజు నిర్మాత. శంకర్‌ శిష్యుడు నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతీకార నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ పాత్ర కోసం వినాయక్‌ బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.