అందులో ఆంటీలా కనిపిస్తానేమో ?

15-05-2019

అందులో ఆంటీలా కనిపిస్తానేమో ?

పద్ధతైన పాత్రలకు చిరునామాగా నిలిచింది కీర్తి సురేష్‌. ఆమె సంప్రదాయమైన వస్త్రధారణలోనే కనిపిస్తుంది. మోడరన్‌ కాస్ట్యూమ్స్‌లోనూ నిండు గానే కనిపిస్తుంది. బహుశా ఈ లక్షణాలే ఆమెను మహిళా అభిమానులకు చేరువ చేశాయి. దుస్తుల విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. పాత్ర అవసరాల్ని తీరుస్తూనే, నాకున్న పరిధుల్ని పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుని దుస్తుల్ని ధరిస్తాను. ఈ విషయంలో దర్శకులు కూడా నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అంటోంది. ఇంట్లో చాలా సాధారణంగానే ఉంటాను. మేకప్‌ కిట్‌ని వీలైనంత దూరంగా ఉంచుతాను. చీరల్ని కట్టడానికి పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే అందులో ఆంటీలో కనిపిస్తానేమో అనే భయం. మహానటి లో దాదాపుగా చీరతోనే కనిపించాను. తెరపై నన్ను నేను చూసుకుంటే ఏంటి ఇంత పెద్దదాన్నయిపోయాను అని అనిపించింది అని చెప్పింది కీర్తి.