మహర్షి తరువాత.. అర్జున్ సురవరం రానుంది

26-04-2019

మహర్షి తరువాత.. అర్జున్ సురవరం రానుంది

మేడే నాడు విడుదల కావాల్సిన అర్జున్‌ సురవరం చిత్రం నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సినిమాలు మజిలీ, చిత్రలహరి, జెర్సీ స్ట్రాంగ్‌గా ఉండడం, రేపు విడుదల కావాల్సిన ఎవెంజర్స్‌-ఎండ్‌ గేమ్‌కి విపరీతమైన క్రేజ్‌ ఉండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు హీరో నిఖిల్‌ ప్రకటించారు. ఎన్నో రోజులు ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డాం. మే 1న విడుదల చేయడం మంచిది కాదని మా పంపిణీదారులు చెప్పారు. అందుకే వారి మాటకు విలువిచ్చి సినిమాను వాయిదా వేస్తున్నాం. మహర్షి తరువాత అర్జున్‌ సురవరం ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు నిఖిల్‌.