మా సినిమాకు హీరోయిన్ కావలెను

26-04-2019

మా సినిమాకు హీరోయిన్ కావలెను

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కోసం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు అందరూ హీరోయిన్లు అర్రులు చాస్తారు. అయితే రాజమౌళి మాత్రం ఓ ఫారిన్‌ మోడల్‌ కోసం చూస్తున్నారు. ఇంతకుముందు ఎంపిక చేసిన డైసీ అనే రష్యన్‌ మోడల్‌.. బయటకు తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. అప్పటినుంచి ఆ స్థానం భర్తీ చేసేందుకు యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ పాత్ర కోసం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. కాగా ఈ చిత్రానికి గాయాల బెడద నడుస్తోంది ప్రస్తుతం. ఆ మధ్య రామ్‌చరణ్‌ కొంచెం గాయపడి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం రాగా..తాజాగా ఎన్టీఆర్‌ చేతికి కూడా గాయమైందని తెలుస్తోంది.