మోస్ట్ సెక్సీయస్ట్ లేడి ఎవరో తెలుసా?

26-04-2019

మోస్ట్ సెక్సీయస్ట్ లేడి ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో అత్యంత శృంగారాత్మక హీరోయిన్‌ (మోస్ట్‌ సెక్సీయస్ట్‌ లేడి) ఎవరు అనే సర్వే నిర్వహించారు. ఇందులో దీపిక పడుకోన్‌ విజేతగా నిలిచింది. దీనిపై రణవీర్‌ స్పందిస్తూ ఇందులో ఆశ్చర్యమేముంది? అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. దీపిక కూడా ఈ కిరీటం తనను వరించడంపై ముసిముసి నవ్వులతో ఈ కిరీటాన్ని స్వాగతిస్తోంది. కెరీర్‌ విషయానికొస్తే యాసిడ్‌ బాధితురాలుగా దీపిక నటిస్తున్న చపాక్‌ షూటింగ్‌ సగానికి పైగా పూర్తయింది. 2020 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.