రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా ?

26-04-2019

రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా ?

సంచలన కాంబినేషన్‌ రజనీకాంత్‌- మురుగదాస్‌ నుంచి రానున్న చిత్రం దర్బార్‌. ఇప్పటికే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టిన దర్శకుడు మురుగదాస్‌, రజనీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. చాలా కాలం తరువాత రజనీతో జోడీ కడుతున్న నయన్‌తార సైతం ఇటీవల షూటింగ్‌లో జాయినైంది. తాజాగా రజనీ దర్బార్‌లో నివేదా థామస్‌కు ఛాన్స్‌ దక్కిందట. ఆమె సైతం షూటింగ్‌లో జాయినైంది. అయితే రజనీ కుమార్తె పాత్రలో నివేద కనిపించనుందని అంటున్నారు. ప్రాజెక్టులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసిందట. ద్విపాత్రాభినయం చేస్తున్న రజనీకి ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ బబ్బర్‌ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది.