అప్పుడు తండ్రి... ఇప్పుడు విలన్!

24-04-2019

అప్పుడు తండ్రి... ఇప్పుడు విలన్!

లెజెండ్‌ సినిమాతో ప్రతినాయకుడిగా సెకండ్‌ ఇన్సింగ్‌కు శ్రీకారం చుట్టారు జగపతిబాబు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతినాయకుడి పాత్రలతో పాటు కీలకమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆయన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆయన మరోసారి విలన్‌గా అవతారమెత్తబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నారని తెలిసింది. శ్రీమంతుడు చిత్రంలో మహేష్‌బాబు తండ్రిగా నటించిన జగపతిబాబు.. ఇప్పుడు ప్రతినాయకుడు అవతారమెత్తబోవడం విశేషం. ప్రస్తుం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెలలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇదని సమాచారం.