'నువ్వు తోపు రా' ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌

23-04-2019

'నువ్వు తోపు రా' ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌

బేబి జాహ్న‌వి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం `నువ్వు తోపురా`. యునైటెడ్ ఫిలింస్‌, ఎస్‌.జె.కె. ప్రొడ‌క్ష‌న్స్(యు.ఎస్‌.ఎ) ప‌తాకాల‌పై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌రినాథ్ బాబు.బి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మే 3న సినిమా విడుద‌ల‌వుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ...

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మాట్లాడుతూ - ``సుధాక‌ర్ కోమాకుల హీరోగా చేసిన `నువ్వు తోపురా` సినిమా ట్రైల‌ర్ చాలా బావుంది. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంద‌ని భావిస్తున్నాను. ఈ సినిమాతో సుధాక‌ర్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్``  అన్నారు. 

నిర్మాత‌లు మాట్లాడుతూ - ``మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి ఎంటైర్ యూనిట్‌ను అభినందించిన ప్ర‌భాస్‌గారికి థాంక్స్‌. అలాగే అల్లు అర‌వింద్‌గారికి, బ‌న్ని వాసుగారు అందిస్తోన్న స‌హ‌కారానికి ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు. సూరి అనే హైద‌రాబాద్ కుర్రాడి జీవితానికి సంబంధించిన క‌థ‌. ఎలాంటి బాధ్య‌త‌లు లేకుండా తిరిగే హీరో..ఎలా మారాడు. అమెరికా ఎందుకు వెళ్లాడు అనేదే క‌థ‌. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు. 

స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  హ‌రినాథ్ బాబు.బి
ప్రొడ్యూస‌ర్:  డి.శ్రీకాంత్‌