త్వరలో అమృత నిలయం

23-04-2019

త్వరలో అమృత నిలయం

విజయ్‌, మమత, రిషి వర్మ, సుహాసన ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం అమృత నిలయం. రాజా విక్రమ నరేంద్ర దర్శకుడు. నాగుల రామ మోహన్‌, ఎం.ప్రవీణ్‌ కుమార్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ యువతరంలో కొంతమంది తాత్కాలిక ఆనందాల కోసం పెడదోవ పడుతున్నారు. వాటి వల్ల వచ్చే అనర్థాల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. సందేశాత్మకంగా ఉంటూనే ఓ మంచి కమర్షియల్‌ చిత్రంగా నిలుస్తుందన్నారు. త్వరలో విడుదల చేస్తామన్నారు నిర్మాతలు.