'ఏదైనా జరగొచ్చు' టీజర్ విడుదల

23-04-2019

'ఏదైనా జరగొచ్చు' టీజర్ విడుదల

క్రైమ్‌ హారర్‌ అంశాలు ప్రధానంగా నేను తెరకెక్కించిన చిత్రం ఏదైనా జరగొచ్చు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది అని దర్శకుడు రమాకాంత్‌ అన్నారు. విజయ్‌ రాజా కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రం ఏదైనా జరగొచ్చు. వెబ్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా సోలంకి, సాషా సింగ్‌ నాయికలు. ఈ సినిమా టిజర్‌ను వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. వినాయక్‌ మాట్లాడుతూ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివాజీరాజాకు ఓ గుర్తింపు ఉంది. వాళ్లబ్బాయి విజయ్‌ పెద్ద స్టార్‌గా ఎదగాలి అని చెప్పారు. మా విజయ్‌కి మంచి విజయం రావాలని శివాజీరాజా అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సుదర్శన్‌ హనగోడు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌ ప్రకాశ్‌ అన్నంరెడ్డి.