జననం ప్రారంభం

22-04-2019

జననం ప్రారంభం

అనిల్‌, భవ్యశ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం జననం. పార్వతి క్రియేషన్‌స పతాకంపై ఎం.పార్వతి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మల్లం దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి లారెన్స్‌ క్లాప్‌కొట్టారు. మే 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది అని దర్శకుడు అన్నారు. అన్ని వర్గాల వారిని మెప్పించే కథ అవుతుందని హీరో తెలిపారు. దర్శకుడితో తాను చేస్తున్న రెండో చిత్రమని నాయిక అన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టంతోటి వచ్చిన వ్యక్తికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాం అని నిర్మాత తెలిపారు.