నితిన్ సరసన రకుల్ ?

22-04-2019

నితిన్ సరసన రకుల్ ?

నితిన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. చంద్ర శేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఖరారైనట్లు సమాచారం. రకుల్‌ హిందీ, తమిళంలో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇటీవలే ఆమె మళ్లీ తెలుగుపై దృష్టి సారించింది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి మన్మథుడు 2లో నటిస్తున్న ఆమె, ఇటీవలే చంద్రశేఖర్‌ యేలేటి నితిన్‌ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. డార్జిలింగ్‌ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందనున్నట్టు సమాచారం.