మే 1న దాసరి మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్

22-04-2019

మే 1న దాసరి మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్

భీమవరం టాకీస్‌- భారత్‌ అర్ట్స్‌ అకాడమి సంయుక్తంగా దాసరి మెమోరియల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ -2019 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 1వ తేదీన ప్రసాద్‌ లాబ్స్‌లో సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన అతిరధ మహారధులు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. దాసరి జీవిత సాఫల్య అవార్డు ఆర్‌.నారాయణమూర్తికి, దాసరి ఎక్స్‌లెన్సీ అవార్డ్‌ పూరి జగన్నాథ్‌కి.. దాసరి పద్మ అండ్‌ దాసరి నారాయణరావు అవార్డ్‌ శ్రీ అండ్‌ శ్రీమతి జీవిత రాజశేఖర్‌లకు, దాసరి యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ అవార్డు  కోసం మహా వెంకటేష్‌, వేణు ఊడుగుల.. తిక్క శశి కిరణ్‌లను ఎంపిక చేశారు. ఇవి కాకుండా 24 క్రాఫ్ట్స్‌లో మరియు ఫిలిం మీడియాలో ప్రతిభావంతులకు కూడా అవార్డ్స్‌ ఇవ్వనున్నారు. అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.